E(A)lochana

ఆలోచనలకు ఈ రూపము ఇవ్వటమే ఈలోచన!!

Saturday, December 17, 2005

మౌనం

నేస్తం!
ఎప్పటికి వీడేను ఈ నిశ్శబ్దం?
నీ మౌనం తో, పగిలిన నా హృదయం,
నీ పలుకు తో అతికించవా మన స్నేహం?

ఎవరు అడిగేను ఇక అన్నం తిన్నవా అని?
పదే పదే మ్రోగేను నీ మాటలు నా మదిలో,
కన్నీరు పారెను వరదలా!, ఆకలి మంటను ఆర్పి వేసేను!
చేధించు ఈ మౌనాన్ని, పెంచు మన స్నేహాన్ని!
పెరగాలి మన స్నేహం నీ మాటతో, కాదు కన్నీటి తో

ప్రార్ధించాను దేముడిని,
నీ ఆరోగ్యం కోలుకోవాలని,
మన స్నేహం వికసించాలని!

నిద్ర లేని కళ్ళు వేచి వుంటాయి నీ రాక కోసం,
వువ్విళ్ళూరే మనసు వేచి వుంది నీ కోసం,
నీ పలుకుతో పారిపోతుంది నిశ్శబ్దం!
నా నేస్తం ఎప్పటికి కారాదు నాకు దూరం!!

0 Comments:

Post a Comment

<< Home